Breaking News
Home / Lifestyle / Business / ప్రభుత్వానికి రూ.4500 కోట్లు చెల్లించిన జియో, వొడాఫోన్, ఎయిర్‌టెల్

ప్రభుత్వానికి రూ.4500 కోట్లు చెల్లించిన జియో, వొడాఫోన్, ఎయిర్‌టెల్

న్యూఢిల్లీ: ప్రైవేట్ టెలికం ఆపరేట్లు అయిన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్ సంస్థలు ప్రభుత్వానికి స్ప్రెక్ట్రమ్ వాయిదాలు చెల్లించాయి. ఈ మూడు సంస్థలు గత మూడు నాలుగు రోజుల్లో టెలికం సంస్థకు రూ.4500 కోట్లు చెల్లించినట్టు తెలిసింది. గడువు తేదీకి ముందే ఈ చెల్లింపులు చేసినట్టు సమాచారం.

ఇందులో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో రూ.1,133 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.2,421 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ రూ.977 కోట్లు చెల్లించాయి. కాగా, టెలికం సెక్టార్ అప్పుల్లో కూరుకుపోవడంతో ఉపశమనం కోసం ఆయా సంస్థలు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. దీంతో స్ప్రెక్టం చెల్లింపుల వాయిదాలను ప్రభుత్వం పదేళ్ల నుంచి 16 ఏళ్లకు పెంచి ఉపశమనం కల్పించింది.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *