Breaking News
Home / Lifestyle / Business / జియో సరికొత్త ఆఫర్… ఆల్ ఇన్ వన్ ప్యాక్స్…

జియో సరికొత్త ఆఫర్… ఆల్ ఇన్ వన్ ప్యాక్స్…

జియో ఇటీవల ఇతర నెట్ వర్కులకు నిమిషానికి 6 పైసలు అంటూ అవుట్ గోయింగ్ కాల్ ఛార్జి ప్రకటించడంతో వినియోగదారులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, తన వినియోగదారులకు ఊరట కలిగించేలా, వారిలో మళ్లీ ఉత్సాహం కలిగించేందుకు జియో సరికొత్త ప్లాన్లు ప్రవేశపెడుతోంది. జియో ఆల్ ఇన్ వన్ పేరిట నెలకు రూ.222, రెండు నెలలకు రూ.333, మూడు నెలలకు రూ.444 3 ప్లాన్లు ప్రకటించింది.

ఈ మూడు ప్లాన్లలో రోజుకు 2 జీబీ డేటా లభ్యమవుతుంది. జియో నుంచి జియో నంబర్లకు కాల్స్ ఉచితం. ముఖ్యంగా, ఇతర నెట్ వర్కులకు చేసే కాల్స్ పై 1000 నిమిషాల ఉచిత టాక్ టైమ్ ఆఫర్ చేశారు. ఇటీవల ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జిల పేరిట భారీ మొత్తం చెల్లించాల్సి వస్తుండడంతో జియో ఇతర నెట్ వర్కులకు వెళ్లే అవుట్ గోయింగ్ కాల్స్ పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా పలు టాప్ అప్ ప్లాన్లు తీసుకువచ్చింది. దాంతో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో తాజాగా ఆల్ ఇన్ వన్ ప్లాన్లు ప్రవేశపెట్టినట్టు అర్థమవుతోంది.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *