Breaking News
Home / States / ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు….

ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు….

హైదరాబాద్: సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం గ్రీన్ సిగ్నలిచ్చింది. సీఎం కేసీఆర్ హామీ మేరకు కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 10 మందికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చారు. నలుగురికి జూనియర్ అసిస్టెంట్, ఐదుగురికి ఆర్టీసీ కానిస్టేబుళ్లు, ఒకరికి కండక్టర్‌గా ఉద్యోగాలిస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌ జోన్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ తెలిపారు. సమ్మె కాలంలో చనిపోయిన కార్మికుల విషయంలో మానవత్వంతో వ్యవహరిస్తామని, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘‘

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *