హైదరాబాద్: నగరంలోని చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ పద్మ ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న జైలు అధికారులు హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. జైల్లో డిప్రెషన్‌కు గురైన పద్మ.. వైద్యులు ఇచ్చిన మందులను మోతాదుకు మించి వేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
