Breaking News
Home / Crime / యూపీలో జర్నలిస్ట్ దారుణ హత్య….

యూపీలో జర్నలిస్ట్ దారుణ హత్య….

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌ ఖుషీనగర్‌ జిల్లాలోని దుబౌలీలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక హిందీ దినపత్రికలో పనిచేసే రాధేశ్యామ్‌ శర్మ (55) గురువారం బైక్‌పై దుబౌలీ గ్రామం మీదుగా వెళ్తుండగా గుర్తు తెలియని దుండగుడు అతడిని అడ్డగించి, ఆపై గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాధేశ్యామ్‌ పార్ట్‌టైమ్‌ జర్నలిస్టుగా పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రాధేశ్యామ్‌ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *