Breaking News
Home / States / Andhra Pradesh / విలేకరి హత్య దుర్మార్గపు చర్య :మాజీ ఎమ్మెల్యే

విలేకరి హత్య దుర్మార్గపు చర్య :మాజీ ఎమ్మెల్యే

ఎటపాక: ఆంధ్రజ్యోతి విలేకరిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దుర్మార్గంగా హత్య చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సున్నం రాజయ్య తీవ్రంగా ఖండించారు. నెల్లిపాక గ్రామంలో ఐవి అధ్యక్షతన సీపీఎం మండల కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన సున్నం రాజయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను గుర్తించి, అవినీతిని వెలికితీసి ప్రపంచానికి తెలియచెప్పే విలేకరులను చంపడం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపడమేనని అన్నారు. అవినీతిని ప్రశ్నించే వారిని అంతం చేయడం దుర్మాగపు చర్య అని, హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి మర్లపాటి నాగేశ్వర రావు, డేగల మాధవరావు, పొడియం రత్తమ్మ, ఇరపా అజరు, ఆకిశెట్టి రాము, హుస్సేన్‌, సుధాకర్‌, నక్కా సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *