Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఆర్టీసీకి ఆక్సిజన్‌ అందించేందుకే..

ఆర్టీసీకి ఆక్సిజన్‌ అందించేందుకే..

అమరావతి : ఏటా రూ.1200 కోట్ల నష్టాలు చవిచూస్తూ వెంటిలేటర్‌పై ఉన్న ఆర్టీసీకి ఆక్సిజన్‌ అందించేందుకే స్వల్పంగా చార్జీలు పెంచుతూ నిర్ణయం తీçసుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. ఆర్టీసీకి ఏ ఏటికి ఆ యేడు నష్టాలు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోవడంతో చార్జీల పెంపు అనివార్యమైందని పేర్కొంది. ప్రభుత్వం స్వల్పంగా చార్జీలు పెంచినా, ఆర్టీసీ ఇంకా రూ.300 కోట్ల నష్టాల్లో ఉంటుందని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపునకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పల్లె వెలుగు, సిటీ సర్వీస్‌ బస్సులకు ప్రతి కిలోమీటర్‌కు రూ.10 పైసలు, ఇతర సర్వీసులకు కిలోమీటర్‌కు రూ.20 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించాలంటే చార్జీలు పెంచక తప్పట్లేదన్నారు. చార్జీల పెంపుపై ఆర్టీసీ బోర్డు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదం తెలిపారని, పెంచిన చార్జీలు ఎప్పటి నుంచి అమలులోకి వచ్చేది ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని ఆయన వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *