Breaking News
Home / States / Andhra Pradesh / ఏపీఈఆర్‌సీ చైర్మన్ గా రిటైర్డ్ జడ్జి…

ఏపీఈఆర్‌సీ చైర్మన్ గా రిటైర్డ్ జడ్జి…

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) చైర్మన్‌గా రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ నాగార్జునరెడ్డిని గవర్నర్‌ విశ్వభూషణ్‌, సీఎం వైఎస్‌ జగన్‌ అభినందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు కూడా హాజరయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *