Breaking News
Home / Sports / కైఫ్.. నీకు ఈ ఫోటో గుర్తందా..?: యువరాజ్‌ సింగ్

కైఫ్.. నీకు ఈ ఫోటో గుర్తందా..?: యువరాజ్‌ సింగ్

టీం ఇండియా ఆటగాడు మహమ్మద్ కైఫ్ శనివారం తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్‌మీడియాలో పలువురు క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే కైఫ్‌కి టీం ఇండియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ యువరాజ్‌ సింగ్ తనదైన స్టైల్‌లో విషెస్ చెప్పారు.

2002 నాట్‌వెస్ట్ సిరీస్‌ ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్, మహమ్మద్ కైఫ్‌లు కలిసి భారత్‌కి విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. భారత్ చేయిదాటిపోయిన ఈ మ్యాచ్‌ని వీరిద్దరు అద్భుతంగా బ్యాటింగ్ చేసి విజయం దిశగా నడిపించారు. ఈ ఘటనని యువరాజ్ మరోసారి కైఫ్ పుట్టిన రోజు సందర్భంగా గుర్తు చేశాడు. ఫైనల్ మ్యాచ్ తర్వాత దిగిన ఫోటోని షేర్ చేసిన యువీ.. ‘‘భాయ్‌సాబ్.. పుట్టినరోజు శుభాకాంక్షలు! నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ తర్వాత దిగిన ఈ ఫోటో గుర్తుందా?’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Check Also

ఆట ఆరంభంలోనే భారత్‌కు షాక్

Share this on WhatsAppపెర్త్: నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఒప్టస్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *