కోడంబాక్కం: దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి కాజల్. ప్రస్తుతం కమల్ నటిస్తున్న ‘ఇండియన్ 2’లో కథానాయికగా నటిస్తోంది. జయంరవి సరసన నటించిన ‘కోమాలి’ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ‘ప్యారీస్ ప్యారీస్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా పెళ్లి గురించి కాజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అందులో ‘త్వరలోనే పెళ్లి విషయం అందరికీ తెలియజేస్తానని, దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు. తనను మరింత బాగా చూసుకునే వ్యక్తే తనకు భర్తగా రావాలని, అంతేకాకుండా అతనిలో భక్తి ఎక్కువగా ఉండాలంటున్నారు కాజల్. ఎందుకంటే తనకు దైవభక్తి ఎక్కువని, అతనిలో అంతకన్నా ఎక్కువగా ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడ షూటింగ్కు వెళ్లినా కాజల్ చిన్న శివుడి విగ్రహాన్ని తన వెంట తీసుకెళ్తారని’ చెప్పుకొచ్చింది.
