Breaking News
Home / States / Andhra Pradesh / సీఎం జగన్ పై టీడీపీ నేత విమర్శలు…

సీఎం జగన్ పై టీడీపీ నేత విమర్శలు…

గుంటూరు: గోదావరిలో బోటు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అద్యక్షుడు కళా వెంకట్రావ్ విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రజలు, బాధితుల తరఫున గోదావరి బోటు ప్రమాదంపై న్యాయ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. బాధిత కుటుంబాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన బోటు ప్రమాదంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన సీఎం అయ్యాక ఎందుకు పాటించటంలేదని ప్రశ్నించారు. 300 అడుగుల లోతున బోటు మునిగిపోతే 3వేల అడుగులపై నుంచి జగన్ ఏరియల్ సర్వే చేసి వెళ్లారని, ఇంకా మృతదేహాలు దొరకని కుటుంబాలకు ముఖ్యమంత్రి ఏం చెప్తారని ఆయన నిలదీశారు. సెప్టెంబర్18న సంఘటన జరిగితే.. ఇప్పటి వరకు సీఎం ఏం సమీక్ష చేశారని ప్రశ్నించారు. మంత్రుల కమిటీ కనీసం కూర్చుని సమీక్షించిందా? అని అన్నారు. ప్రభుత్వంలో లేనప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ప్రవర్తించడం జగన్‌కే చెల్లుతుందని కళా వెంకట్రావ్ అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *