Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడు కలాం ప్రతిభా అవార్డులు

నేడు కలాం ప్రతిభా అవార్డులు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఏపీజే అబ్దుల్‌ కలాం ప్రతిభా అవార్డుల ప్రదానం చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌, ఇంటర్‌లో ప్రతిభ కనబరచిన ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్‌ కళాశాలలకు చెందిన 3983 మంది విద్యార్థుల జాబితా వెల్లడించింది. ఈ అవార్డు కింద ఒక్కో విద్యార్థికి జ్ఞాపిక, ప్రశంసా పత్రంతోపాటు వారి బ్యాంకు ఖాతాకు రూ.20 వేల నగదు జమచేస్తారు. మేనేజ్‌మెంట్ల వారీగా ఎయిడెడ్‌ స్కూళ్లకు 102, ఆశ్రమ పాఠశాలలకు 34, బీసీ గురుకులాలకు 45, ప్రభుత్వ పాఠశాలలకు 168, కేజీవీబీ 251, మోడల్‌ స్కూళ్లకు 316, మున్సిపల్‌ స్కూళ్లలో 142, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 92, సాంఘిక సంక్షేమ గురుకులాలకు 189, గిరిజన గురుకులాలకు 47, జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు 2597 మందికి అవార్డులు దక్కాయి. సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీకి చెందిన విద్యార్థులు 5 శాతం అవార్డులు దక్కించుకోవడం గమనార్హం. కృష్ణా జిల్లాకు సంబంధించిన అవార్డు గ్రహీతలకు గవర్నర్‌, ముఖ్యమంత్రి చేతుల మీదుగా విజయవాడలో ప్రదానం చేస్తారు.

Check Also

సాంకేతిక లోపం వల్ల విమానం నిలిపివేత….

Share this on WhatsAppవిశాఖపట్టణం : అండమాన్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని సాంకేతిక లోపం వల్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *