Breaking News
Home / Film News / కల్యాణ్ రామ్ తాజా చిత్ర టీజర్ విడుదల…

కల్యాణ్ రామ్ తాజా చిత్ర టీజర్ విడుదల…

ఫిల్మ్ న్యూస్: కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది. మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

విజయ దశమి సందర్భంగా తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. కల్యాణ్ రామ్ మంచితనం గురించి కుటుంబ సభ్యులు ఒకవైపు చెబుతుంటే మరోవైపు యాక్షన్ సన్నివేశాలు వస్తుంటాయి. `రాముడు కూడా మంచోడేరా.. కానీ రావణాసురుణ్ని వేసెయ్యలా` అని టీజర్ చివర్లో కల్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. సతీష్ వేగేశ్న తరహా పల్లెటూరి కుటుంబ బంధాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *