Breaking News
Home / Film News / విజయ్‌ ఆంటోనితో కమల్‌ గారాలపట్టి…

విజయ్‌ ఆంటోనితో కమల్‌ గారాలపట్టి…

కోడంబాక్కం: ‘వివేగం’, ‘కడారం కొండాన్‌’ చిత్రాల్లో నటించి మెప్పించిన కమల్‌ రెండో గారాలపట్టి అక్షర హాసన్‌ త్వరలోనే విజయ్‌ ఆంటోని చిత్రంలో కనిపించనుంది. మూడర్‌కూడం ఫేమ్‌ నవీన్‌ దర్శకత్వంలోని చిత్రంలో విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘అగ్ని సిరగుగల్‌’ అని పేరు పెట్టారు. ఇందులో అరుణ్‌ విజయ్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. షాలినిపాండే కథానాయిక. నాజర్‌, ప్రకాశ్‌రాజ్‌, మీరా మిథున్‌, కలైయరసన్‌లు ఇతర తారాగణం. ఇప్పుడు ఈ జట్టులో నటి అక్షరహాసన్‌ కూడా చేరింది. తాజాగా ఈ చిత్ర బృందంతో అక్షరహాసన్‌ ఫొటో దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అంతేకాకుండా ఈ బృందం చిత్రీకరణ కోసం రష్యా బయలుదేరింది. అక్కడ పది రోజుల పాటు షూటింగ్‌ జరుగనుందని సమాచారం. మాస్‌ కమర్షియల్‌ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను చిత్రవర్గాలు ప్రకటించనున్నాయి.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *