Breaking News
Home / States / Andhra Pradesh / దేవాలయాల పట్ల చులకన భావంతో ఉన్నారు…

దేవాలయాల పట్ల చులకన భావంతో ఉన్నారు…

గుంటూరు: రాష్ట్ర అభివృద్ధి కుంటుపడేలా ప్రభుత్వ నిర్ణయాలున్నాయని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. పాలనలో టీడీపీ, వైసీపీ మధ్య తేడా లేదన్నారు. హిందూ దేవాలయాల పట్ల చులకన భావంతో ఉన్నారని.. ప్రభుత్వ ఖర్చుతో ఒక మతాన్ని పెంచి పోషిస్తున్నారని కన్నా ఆరోపించారు.

జాతీయ పార్టీ అయిన బీజేపీ ఏ ప్రాంతీయ పార్టీకీ అద్దె మైకుగా పని చేయదన్నారు. ఇసుక పాలసీ వచ్చి నెలైనా సామాన్యుడికి లభ్యం కావడం లేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన పది శాతం రిజర్వేషన్లను అమలు చేయటం లేదన్నారు. 10 శాతం రిజర్వేషన్ల అమలుపై 4న కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇసుక కొరతపై 7న భిక్షాటన, 11న పోలవరంలో పర్యటన నిర్వహించనున్నట్టు కన్నా స్పష్టం చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *