గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ఇసుక విధానానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త ఇసుక విధానంపై ఆయన విమర్శలు చేశారు. పెళ్లికి ముందే ముహూర్తం పెట్టినట్లు ఇసుక విధానానికి సీఎం ముహూర్తం పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించే విషయంలో చూపించే శ్రద్ధ.. కార్మికులను ఆదుకునేందుకు చూపడం లేదని అన్నారు. ఇసుక కొరతతో కార్మికులు ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గు చేటే అని.. ఇసుక అందే వరకూ కార్మికులకు రూ.10వేలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
