అమరావతి: రాజకీయ విలువలు లేని టీడీపీతో బీజేపీ ఎప్పటికీ పొత్తు పెట్టుకోదని ఎపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అవినీతే అజెండాగా అవకాశవాద రాజకీయాలతో యూటర్న్ లు తీసుకుంటూ దేశ రాజకీయాల్లో విలువలను దిగజార్చిన పార్టీగా టీడీపీని అభివర్ణించారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పొత్తుకోసం వెంపర్లాడుతున్నారో చెప్పాలని కన్నా నిలదీశారు.
