Breaking News
Home / States / Andhra Pradesh / ‘ఏపీలో ఎవరికీ రక్షణ లేదు’

‘ఏపీలో ఎవరికీ రక్షణ లేదు’

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని బీజేపీ అధ‍్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అసలు రాష్టంలో ఎవరికీ రక్షణ లేదంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత పైడికొండల మాణిక్యాల రావును హౌస్‌ అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో తాడేపల్లిగూడెం బయల్దేరిన తమ పార్టీ నేతల్ని పోలీసులు అడ్డుకోవడంపై కన్నా అసహనం వ్యక్తం చేశారు. కనకదుర్గమ్మ వారధి వద్ద రోడ్డుపై బైఠాయించిన కన్నా.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందనడానికి ఇదే ఉదాహరణని ఆరోపించారు.

Check Also

అగ్రహీరోలకు నృత్యం నేర్పిన ప్రముఖ కొరియోగ్రాఫర్ అరెస్ట్

Share this on WhatsAppముంబై: నృత్య శిక్షణ పేరుతో మోడల్స్‌ను, అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నటీమణులను సెక్స్ రాకెట్‌లోకి దింపుతున్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *