Breaking News
Home / States / Andhra Pradesh / రాజకీయ దొంగలంతా ఏకమయ్యారు: కన్నా

రాజకీయ దొంగలంతా ఏకమయ్యారు: కన్నా

విజయవాడ: మోదీ ప్రభంజనాన్ని అడ్డుకొనేందుకు రాజకీయ దొంగలంతా ఏకమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. విజయవాడ ధర్నా చౌక్‌లో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. కోల్‌కతాలో అమిత్ షా ర్యాలీపై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. డౌన్ డౌన్ మమతా బెనర్జీ అంటూ నినాదాలు చేశారు. ధర్నాలో కన్నా పాల్గొని మాట్లాడారు. మమత బెనర్జీపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మమతాను సమర్థిస్తున్న చంద్రబాబుపై కూడా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు మళ్లీ బీజేపీకే పట్టం కట్టబోతున్నారని జోస్యం చెప్పారు.

Check Also

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

Share this on WhatsAppఏలూరు: సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ (బీఏఎస్‌) పథకంలో 2019-20 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *