Breaking News
Home / National / రాజమాతను కలుసుకున్న కన్నడ సీఎం…

రాజమాతను కలుసుకున్న కన్నడ సీఎం…

బెంగళూరు: కన్నడ సీఎం యడ్యూరప్ప మైసూరు దసరా ఉత్సవాల ఆరంభం రోజునే రాజమాత ప్రమోదాదేవి ఒడయార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. జంబూ సవారీ రోజునే అంబారీకి పుష్పార్చన చేసేందుకు యువరాజు యదువీర్‌ ఒడయార్‌ను పంపాలని రాజమాతను కోరారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలు అద్భుతంగా ఆరంభమయ్యాయని దీపాలంకరణ, ఫలపుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని రాజమాతకు వివరించారు. అయితే యువరాజు పాల్గొనే విషయం ఇంకా స్పష్టత చేయలేదు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *