Breaking News
Home / National / ప్రధానిపై మండిపడ్డ కన్నడ మాజీ సీఎం…

ప్రధానిపై మండిపడ్డ కన్నడ మాజీ సీఎం…

బెంగళూరు: ప్రధాని మోదీపై కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఫైర్ అయ్యారు. కేంద్రంలో మోదీ ‘ఫాసిస్టు’ తరహా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలన అచ్చు హిట్లర్ పాలనలా ఉందని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరూ సాహసించడం లేదని విమర్శించారు.

కర్నాటక రాష్ట్రం వరదలతో నష్టపోయిందని, ఇందుకు తాము కేంద్రాన్ని 5,000 కోట్లను సాయం చేయమని కోరితే కేవలం 1,200 కోట్లను పంపి చేతులు దులిపేసుకుందని ఆయన మండిపడ్డారు. సీఎం యడ్యూరప్పకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంతగా అవగాహన లేదని, కేంద్రం పంపిన సాయం ఏ మూలకూ సరిపోదని సిద్దరామయ్య ధ్వజమెత్తారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *