Breaking News
Home / National / సుప్రీం తీర్పుపై కన్నడ అసెంబ్లీ స్పీకర్ కొత్త మెలిక!

సుప్రీం తీర్పుపై కన్నడ అసెంబ్లీ స్పీకర్ కొత్త మెలిక!

బెంగళూరు: అసమ్మతి ఎమ్మెల్యేలు తనతో సమావేశం కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారో అర్థం కావట్లేదని కర్నాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ పేర్కొన్నారు. వాళ్లు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల ఈ వ్యవహారం మరింత మసకబారిందని వ్యాఖ్యానించారు. మరికొద్దిసేపట్లో ముంబై నుంచి వచ్చిన అసమ్మతి ఎమ్మెల్యేలు ఆయనతో సమావేశం కానున్న నేపథ్యంలో విధాన సౌధ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘వాళ్లు నా కార్యాలయానికి రాకుండా నేనెప్పుడూ అడ్డుకోలేదు. నన్ను కలుసుకోవడం కోసం వాళ్లు సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారో నాకు తెలియదు…’’ అని స్పీకర్ పేర్కొన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యేకి తన దగ్గరకు వచ్చేందుకు ఎప్పుడూ అడ్డుచెప్పలేదని ఆయన అన్నారు.

ఎమ్మెల్యేల రాజీనామాలపై ఇవాళే నిర్ణయం తీసుకుంటారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు నన్ను ఆదేశించింది. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పలేదు..’’ అని పేర్కొన్నారు. దీంతో ఆయన ఇవాళ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా ఇప్పటికే కర్నాటక సీఎం కుమారస్వామి, మంత్రి డీకే శివకుమార్ తదితరులు విధాన సౌధ వద్దకు చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సుప్రీం ఆదేశాల మేరకు కర్నాటక పోలీసులు విధాన సౌధ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Check Also

రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు

Share this on WhatsAppబెంగళూరు: ‘అనర్హత వేటు’ అంశం మరోసారి కర్ణాటక రాజకీయ సంక్షోభం, విశ్వాస పరీక్ష నేపథ్యంలో చర్చకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *