Breaking News
Home / Film News / విజయ్ ‘బిగిల్‌’తో పోటీపడనున్న కార్తీ ‘ఖైదీ’…

విజయ్ ‘బిగిల్‌’తో పోటీపడనున్న కార్తీ ‘ఖైదీ’…

కోడంబాక్కం: తరచూ మూసధోరణి సినిమాల్లో నటించడానికి తమిళ నటులు పెద్దగా ఆసక్తి చూపరు. అందులో కార్తి ఒకరు. తండ్రి శివకుమార్‌, అన్న సూర్యలకు పరిశ్రమలతో గొప్ప పేరు ఉన్నప్పటికీ ‘పరుత్తివీరన్‌’ వంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తర్వాత నుంచి ఆయన వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ‘ఖైదీ’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో కథానాయికకు ప్రేమ సన్నివేశాలు లేవని, అంతేకాకుండా యుగళ గీతాలు, ఇతర పాటలు అస్సలు లేవని చిత్రవర్గాలు స్పష్టం చేశాయి. ఇది కేవలం యాక్షన్‌, థ్రిల్లర్‌ చిత్రం మాత్రమేనని తెలిపాయి. ‘ఇందులో ప్రేమ, పాటలు లేవు. యాక్షన్‌ మాత్రమే. అందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ కార్తి తన అభిమానులను, ప్రేక్షకులను ట్విట్టర్‌లో కోరారు.

మరి ఇలాంటి చిత్రం మాస్‌ కమర్షియల్‌తో రూపొందిన ‘బిగిల్‌’తో ఎలా పోటిపడుతుంది..? అని పలువురు ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వ ప్రతిభ ఉందని కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూశాకే నటుడు విజయ్‌ కూడా తన తదుపరి (64వ) చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించారని సమాచారం.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *