Breaking News
Home / Politics / కేసీఆర్‌ మరో గజినీలా తయారయ్యాడు…

కేసీఆర్‌ మరో గజినీలా తయారయ్యాడు…

 హైదరాబాద్‌ : హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎంతో గొప్ప చరిత్ర కలిగిన యాదాద్రిలో అపచారాలు జరుగుతున్నాయని .. బుధవారం లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ హైందవ ధర్మానికి ముప్పుగా మారారని, బొట్టు పెట్టుకొని యాగాలు, పూజాలు చేస్తే భక్తునిగా మారలేరని కేసీఆర్‌ను విమర్శించారు. యాదాద్రిలో దేవుడి కంటే ముందు కేసీఆర్‌ను దర్శించుకునేందుకు చిత్రాలు వేయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ నరసింహ స్వామిని ఉల్లితో చెక్కడం దారుణమన్నారు. శిల్పులు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు శిల్పాలు చెక్కుతున్నట్లు అధికారులే స్పష్టం చేశారని లక్ష్మణ్‌ తెలిపారు.ఇక ఆధ్యాత్మికాన్ని అడ్డు పెట్టుకొని యాదాద్రిలో​ కేసీఆర్‌ రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారానికి తెరలేపారని లక్ష్మణ్‌ ఆరోపించారు. యాదాద్రి అభివృద్ధి కంటే రియల్‌ ఎస్టేట్‌పై కేసీఆర్‌కు మక్కువ ఎక్కువైందని, యాదాద్రిలో ఆయన మహా అపచారానికి పాల్పడుతున్నారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ ఒక గజినీలా తయారయ్యారని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *