Breaking News
Home / National / మోదీతో ముగిసిన కేసీఆర్‌ భేటీ

మోదీతో ముగిసిన కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి నిధులు ఇవ్వాలని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కోరారు. ఆర్థిక మాంద్యం దృష్ట్యా రాష్ట్రానికి గ్రాంట్లు, కేంద్రం వాటా నిధులు యథాతథంగా ఇవ్వాలని కేసీఆర్ కోరారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ కర్మాగారం , బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని మోదీని కేసీఆర్‌ కోరారు. వెనుకబడిన జిల్లాలకు, కేంద్ర సౌజన్య పథకాలకు నిధులు ఇవ్వాలని, జోనల్‌ విధానంలో కొత్త జిల్లాలకు చోటు కల్పించాలని సీఎం, ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఆహారశుద్ధి పరిశ్రమలకు కేంద్ర సాయం అందించాలని కూడా కేసీఆర్‌ కోరారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్‌ ప్రతిపాదించిన 19 వేల కోట్ల ఇవ్వాలని మోదీని కేసీఆర్ కోరారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *