హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి తారకమ్మ (105) మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అంతేకాకుండా సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి ఎంపీ రాములు తదితరులు తారకమ్మ మృతికి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. నిరంజన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలిపారు. అనారోగ్య కారణంగా తారకమ్మ సోమవారం తెల్లవారుజామున వనపర్తిలో తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని నిరంజన్‌రెడ్డి స్వగ్రామమైన పాన్‌గల్ మండలంలోని కొత్తపేటకు ప్రత్యేక వాహనంలో తీసుకుళ్తున్నారు.
