హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకూ ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదు ఒక మోసగాడు అంటూ ధ్వజమెత్తారు. ఆర్టీసీని ఎలా విలీనం చేయాలో జగన్తో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆర్టీసీని బ్రతికించాల్సిన అవసరం లేదా? అని అడిగారు. ‘నువ్వు కేవలం ఆస్తులు అమ్ముకోవడం కోసమే ఈ చర్యలకు పాల్పడుతున్నావని’ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు గెలవకపోతే తెలంగాణ సమాజం ఓడినట్లేనని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
