Breaking News
Home / Film News / కీర్తి తాజా చిత్రం టైటిల్‌ పోస్టర్‌ విడుదల….

కీర్తి తాజా చిత్రం టైటిల్‌ పోస్టర్‌ విడుదల….

హైదరాబాద్‌: నటి కీర్తి సురేశ్‌ ‘మహానటి’తో జాతీయ నటిగా గుర్తింపు సాధించారు. ప్రస్తుతం ఆమె కమర్షియల్‌ చిత్రాలతో పాటు మహిళా ప్రాధాన్యమున్న సినిమాల్లో కూడా నటిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమయ్యింది. అయితే గురువారం కీర్తి సురేశ్‌ పుట్టినరోజు సందర్భంగా కార్తీక్‌ సుబ్బరాజు సినిమాకి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కీర్తి సురేశ్‌ గర్భిణిగా కనిపించారు. సంతోష్‌ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో కూడా విడుదలకానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీనితోపాటు కీర్తిసురేశ్‌, నితిన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతన్న ‘రంగ్‌దే’ సినిమాలో నటిస్తున్నారు. ‘మిస్‌ ఇండియా’లో కూడా కీర్తి సురేశ్‌ కనిపించనున్నారు. మరోవైపు బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ‘మైదాన్‌’ సినిమాలో కీర్తి కీలక పాత్రలో నటించనున్నారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *