Breaking News
Home / National / న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ విజయం

న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ విజయం

న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ భారీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 13,508 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. శీలంపూర్‌లో ఆప్‌ అభ్యర్థి అబ్దుల్‌ రెహమాన్‌ విజయం సాధించారు. సంగంవిహార్‌, దేవ్‌లీలో ఆప్‌ అభ్యర్థులు మెహనియా, ప్రకాష్‌లు విజయం సాధించారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా 1288 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ముస్తఫాబాద్‌లో బీజేపీ అభ్యర్థి జగదీష్‌ ప్రధాన్‌ విజయం సాధించారు. కల్కాజీలో ఆప్‌ అభ్యర్థి 2070 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.

కేజ్రీవాల్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ అభినందనలు
ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మూడోసారి సీఎం కాబోతున్న కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపారు.‘ భారత దేశ ఆత్మను కాపాడినందుకు ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు’ అని ప్రశాంత్‌ కిశోర్‌ ట్వీట్‌ చేశారు. కాగా,ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు ప్రశాంత్‌ కిశోర్‌ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.

టాపాసులు కాల్చకండి : కేజ్రీవాల్‌
ఆప్‌ భారీ విజయం దిశగా దూసుకెళ్తుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. పార్టీ విజయోత్సవాల్లో భాగంగా టపాసులు కాల్చవద్దని కార్యకర్తలకు ఆదేశించారు. టాపాసులు స్థానంలో స్వీట్లు పంపిణీ చేయండి అని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీ వాయు కాలుష్యం దృష్ట్యా సీఎం కేజ్రీవాల్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆప్‌ పేర్కొంది.

ఐదింతలు పెరిగిన బీజేపీ బలం
దేశ రాజధాని ఢిల్లీ పీటాన్ని మరోసారి సామన్యుడే అధిరోహించనున్నాడు. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలకు అనుగుణంగా ఆప్‌ ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడి ఫలితాల ప్రకారం ఉదయం 11 గంటలకు ఆప్‌ 54 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, బీజేపీ 16స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ పత్తా లేకుండా పోయింది. ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ ఆధిక్యంలో లేకపోవడం గమనార్హం.

ఉచిత విద్యుత్‌తో ఆప్‌కు అనుకూలం: బీజేపీ ఎంపీ
నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే వారికి బిల్లు ఉండదని కేజ్రీవాల్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో పేదల ఓటింగ్‌పై ప్రభావం చూపిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేష్‌ బిధురి అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ దూకుడు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువ చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

ఓటమికి బాధ్యత వహిస్తా : మనోజ్‌ తివారీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తానని బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ అన్నారు. ఆప్‌ దూకుడుతో కాషాయ పార్టీ కొద్దిస్ధానాలకే పరిమితం కావడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. 70 స్ధానాలు కలిగిన ఢిల్లీలో ఆప్‌ ప్రస్తుతం 50 స్ధానాల్లో ముందజంలో ఉండగా, బీజేపీ 20 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. 2015 ఎన్నికల్లో బీజేపీ కేవలం మూడు స్ధానాలు గెలుచుకున్న బీజేపీ పుంజుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరట ఇస్తోంది.

సంబరాల్లో ఆప్‌..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విస్పష్ట విజయం ఖాయమవడంతో ఆప్‌ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆప్‌ కార్యాలయం వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఆరు జిల్లాల్లో ఆప్‌ ఏకపక్షంగా దూసుకుపోతోంది.

సత్తా చాటిన ఆప్‌
ఢిల్లీ అసెంబ్లీ ఫలితాల్లో ఆప్‌ మొదటి నుంచి లీడ్‌లో కొనసాగుతుతోంది. మెజారిటీ స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తం 70 స్థానాలకుగాను ఆప్‌ 50 స్థానాల్లో, బీజేపీ 19 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌, ద్వారాకా, జనక్‌ పురి, కృష్ణానగర్‌లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ అధిక్యంలో కొనసాగుతున్నారు.

 

 

Check Also

త్వరలో ఇంటి సహాయకులు, ఆటోవాలాలు, రోజువారీ కూలీలకు కరోనా పరీక్షలు

Share this on WhatsAppదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపధ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *