Breaking News
Home / National / కేరళలో రాహుల్ సుడిగాలి పర్యటన…

కేరళలో రాహుల్ సుడిగాలి పర్యటన…

తిరువనంతపురం: వరదలతో అతలాకుతులమైన కేరళలో రాహుల్ సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. జర్మనీ, లండన్ పర్యటనలు ముగించుకుని స్వదేశానికి చేరుకున్న రాహుల్ ఆ వెంటనే కేరళ పర్యటనకు బయలుదేరారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం తిరువనంతపురం చేరుకున్న రాహుల్‌కు విమానాశ్రయం వద్ద ఆ నియోజకవర్గం ఎంపీ శశిథరూర్, ఇతర నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాహుల్ చెంగనూరు వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న సాయం అడిగి తె లుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా నిలబడతామని ఓదార్చారు. అనంతరం చాలకుడిలో వరద బాధితులను పరామర్శించారు. క్రిస్టియన్ కాలేజీలో తలదాచుకుంటున్న బాధితులను కలిశారు. వరదల్లో బాగా దెబ్బతిన్న అళప్పుజ, అంగమలై, వయనాడ్ జిల్లాల్లోనూ రాహుల్ ఇవాళ సాయంత్రం పర్యటించనున్నారు. రాహుల్ పర్యటనలో ఆయన వెంట కేరళ అసెంబ్లీ విపక్ష నేత రమేష్ చెన్నితాల, కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎంఎం హన్ తదితరులు పాల్గొన్నారు.

అంతకుమందు రాహుల్ ఓ ట్వీట్‌లో కేరళ వెళ్తున్న విషయాన్ని తెలిపారు. రెండ్రోజుల పాటు కేరళలో ఉండి వరద బాధిత ప్రాంతాలు, సహాయక శిబిరాల్లోని బాధితులను పరామర్శిస్తానని, మత్స్యకారులను కలుసుకుంటానని, అవిశ్రాంతంగా బాధితులకు సహాయం అందింస్తున్న పార్టీ కార్యకర్తలు, తదితరులను సైతం కలుసుకుంటానని ఆయన ట్వీట్ చేశారు.

Check Also

సభలో కలతచెందిన సోనియాగాంధీ

Share this on WhatsAppన్యూఢిల్లీ: రాఫెల్ డీల్‌పై దేశాన్ని తప్పుదోవ పట్టించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *