Breaking News
Home / States / Andhra Pradesh / తితిదే బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు….

తితిదే బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు….

తిరుమల: తిరుపతిలో తితిదే పాలక మండలి సమావేశం ముగిసిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ బోర్డు తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. తిరుపతిలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి పాలక మండలి తీర్మానం చేసిందని, స్విమ్స్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో తితిదే ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మార్పులు, చేర్పులతో గరుడ వారధిని పూర్తి చేయాలని నిర్ణయించామని, మద్యపాన నిషేధంపై చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎంపిక చేసిన శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులకు ‘బ్రహ్మోత్సవ బహుమానం’ కింద శాశ్వత ఉద్యోగులకు రూ.14వేలు, కాంట్రాక్టు ఉద్యోగులకు రూ.6,850 ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. తిరుమలలో మూడు నెలల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని తీర్మానించినట్లు వైవీఎస్ చెప్పారు.

తితిదే పరిధిలోని 162 మంది అటవీ కార్మికులను రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయించామని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం తిరుపతిలో ‘శ్రీవారి భక్తిధామం’ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. భక్తులు దర్శనానికి వెళ్లేవరకు నిరీక్షించకుండా శ్రీవారి భక్తిధామంలో గడిపేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నామన్నారు. అక్కడ భక్తి ప్రవచనాలు, యోగా, లేజర్‌ షోలతో పాటు చిన్నారుల్లోనూ భక్తిభావం పెంపొందించే ఏర్పాట్లు చేస్తామని వైవీఎస్ వివరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *