Breaking News
Home / States / రేపు ఆర్టీసీ సమ్మెపై కీలక సమావేశాలు…

రేపు ఆర్టీసీ సమ్మెపై కీలక సమావేశాలు…

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభమై నాలుగు రోజులవ్వడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్న నేపథ్యంలో రేపు (బుధవారం) సమ్మెపై కీలక సమావేశాలు కొనసాగనున్నాయి. బుధవారం ప్రభుత్వ పెద్దలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు భేటీ అయి, పరిస్థితులను గురించి వివరించనున్నారు. ఇప్పటికే డిపోల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు మొదలయ్యాయి. జేఏసీ నేతలు పూర్తి స్థాయి కార్యాచరణకు దిగేలా, తదుపరి వ్యూహ రచన చేసుకునేందుకు రేపు సమావేశం కానున్నారు. లీగల్‌ నోటీసుల విషయంపైనా వీరి మధ్య చర్చ జరగనుంది. మరోవైపు ఆర్టీసీ కార్మికుల పట్ల సర్కారు మొండి వైఖరిని అవలంభిస్తోందని ఆరోపిస్తూ, రేపు అఖిలపక్ష నేతలు సమావేశమై పరిస్థితిని చర్చించనున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *