Breaking News
Home / Film News / ‘బిగిల్’ పై ఆధిపత్యాన్ని సాధిస్తున్న ‘ఖైదీ’

‘బిగిల్’ పై ఆధిపత్యాన్ని సాధిస్తున్న ‘ఖైదీ’

ఫిల్మ్ న్యూస్: విజయ్ కథానాయకుడిగా దీపావళి కానుకగా అక్టోబర్ 25న తమిళలో ‘బిగిల్’ భారీస్థాయిలో విడుదలైంది. అదే రోజున తెలుగులోనూ ఈ సినిమా ‘విజిల్’ పేరుతో ప్రేక్షకులను పలకరించింది. కార్తీ కథానాయకుడిగా ‘ఖైదీ’ కూడా అదే రోజున విడుదలైంది. విజయ్ కి గల క్రేజ్ కారణంగా ‘బిగిల్’ భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. ఇక పెద్దగా అంచనాలు లేని ‘ఖైదీ’ మౌత్ టాక్ తో ఊపందుకుంది.

అయితే థియేటర్స్ ఆక్యుపెన్సీ విషయంలో ‘బిగిల్’ ను ‘ఖైదీ’ బీట్ చేసిందని చెబుతున్నారు. ఈ నెల 1 నుంచి 3 తేదీ వరకూ పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా వున్న మల్టీ ప్లెక్స్ లలో ‘బిగిల్’ 68 శాతం ఆక్యుపెన్సీకి పరిమితం కాగా, ‘ఖైదీ’ 74 శాతం ఆక్యుపెన్సీని సాధించడం విశేషం. ఇక తెలుగు వెర్షన్ విషయానికొస్తే, ‘విజిల్’ 47 శాతం ఆక్యుపెన్సీని కలిగి ఉండగా, ‘ఖైదీ’ 66 శాతం ఆక్యుపెన్సీని కలిగివుంది. ‘బిగిల్’ భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా కాగా, ‘ఖైదీ’ చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమా కావడం విశేషం.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *