Breaking News
Home / States / Telangana / ఖమ్మం జిల్లా: ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై దాడి

ఖమ్మం జిల్లా: ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై దాడి

ఖమ్మం: జిల్లాలోని వైరా మునిసిపాలిటీ 15వ వార్డు ఇండిపెండెంట్‌ అభ్యర్థిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఓటర్లకు చీరెలు పంచుతుండగా ఇండిపెండెంట్‌ అభ్యర్థి నాగరాజు అడ్డుకున్నాడు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనపై నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తెలంగాణ రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏకగ్రీవమైన వార్డులు, డివిజన్లను మినహాయించి మిగతా వాటికి పోలింగ్‌ జరుగుతోంది. ఒక్క కరీంనగర్‌ కార్పొరేషన్లో మాత్రం ఈనెల 24న పోలింగ్‌ జరగనుంది. మొత్తంగా మునిసిపల్‌ ఎన్నికల్లో 7,981 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో 53,50,255 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *