Breaking News
Home / Crime / మేనల్లుడిని హత్యచేసి, అనుమానం రాకుండా….

మేనల్లుడిని హత్యచేసి, అనుమానం రాకుండా….

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని డాబ్రీ ప్రాంతంలో మూడు నెలల క్రితం ఒక ఇంటిలో తులసి మొక్క కింద మావన అస్థిపంజరం లభ్యమైంది. దీనికి సంబంధించిన కేసును ద్వారకా జిల్లా పోలీసు విభాగానికి చెందిన ఏటీఎస్ టీమ్ చేధించింది. హతుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని వారు ప్రశ్నించడంతో తన మేనల్లుడిని హత్య చేసి, మృతదేహాన్ని పాటిపెట్టి, దానిపై తులసి మొక్క నాటినట్లు తెలిపాడు. పోలీసులు నిందితుడిని విజయన్ మహారాణాగా గుర్తించారు. కాగా పోలీసులకు 2018 అక్టోబరు 9న ఒక ఇంట్లో మానవ అస్థిపంజరం ఉన్నట్లు సమాచారం అందించింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో ఆ మృతదేహం జయప్రకాష్ మహారాణా(27)కు చెందినదిగా గుర్తించారు. ఈ నేపధ్యంలోనే పోలీసులకు మృతుని మామ విజయన్ మహారాణాపై అనుమానం తెలెత్తింది. అయితే అతను అప్పటికే పరారయ్యాడని పోలీసులు గుర్తించారు. ఈ నేపధ్యంలో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. తన మేనల్లుడి ప్రియురాలితో తనకు స్నేహం ఏర్పడిందని, అందుకే అతనిని అడ్డుతొలగించుకున్నానని విజయన్ మహారాణా పోలీసులకు చెప్పాడు.

Check Also

కన్నీరుపెట్టిస్తున్న ఓ అమర జవాను కథ…..

Share this on WhatsAppపుణె: వ్యాధితో బాధపడుతోందని తెలిసీ ప్రేమ వివాహం చేసుకుని ఓ యువతికి జీవితాన్ని ప్రసాదించాడు. ఎల్లప్పుడూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *