Breaking News
Home / World News / రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్ భేటి

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్ భేటి

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురువారం కలుసుకున్నారు. కిమ్‌కు పుతిన్ కరచాలనం చేసి స్వాగతం పలికారు. రష్యా తూర్పు తీర నగరమైన వ్లాడివోత్సోక్‌లో వీరు ఇద్దరి సమావేశం జరగనుంది. ఈ భేటీలో పాల్గొనేందుకు కిమ్ తన ప్రైవేటు రైలులో రష్యా వెళ్లారు.

కొరియా ద్వీపకల్ప ‘‘న్యూక్లియర్ సమస్య’’పై ఈ భేటీ జరుగుతుందని రష్యా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో వియత్నాం రాజధాని హనోయిలో కిమ్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో కిమ్, పుతిన్ భేటీ జరగబోతోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి కిమ్‌కి మద్య జరిగిన ఉత్తర కొరియా అణు ఒప్పందంపై జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది. వీరిరువురి చర్చలతో అమెరికా వైఖరి మెత్తబడుతుందని, ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న అంతర్జాతీయ ఆంక్షలు కొంతైనా సడలుతాయని ఉత్తర కొరియా ఆశించింది. కానీ వారు ఆశించినది ఏం ముందుకు సాగలేదు.

Check Also

ట్రంప్‌ సర్కార్‌కు న్యాయస్థానం ప్రశ్న

Share this on WhatsApp80% దరఖాస్తులను రద్దు చేస్తారా? ట్రంప్‌ సర్కార్‌కు న్యాయస్థానం ప్రశ్న మనవాళ్లకు సానుకూలంగా నిర్ణయం వాషింగ్టన్‌: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *