సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త వివాదాన్ని రాజేశాడు. ఉత్తర కొరియాలో అత్యంత ప్రమాదకర పర్వతంపై కిమ్ గుర్రపు సవారీ చేశారు. తెల్లటి మంచుతో కప్పేసిన ‘పయేక్టు’ అనే పర్వతంపై ఆయన ఒక్కరే సవారీ చేసినట్లు కేఎన్సీఏ వార్తా వెల్లడించింది. కిమ్ పెద్ద తెల్లటి గుర్రాన్ని ఎక్కి షికారు చేస్తున్న ఫొటోలు కూడా బయటకి వచ్చాయి. ఉత్తర కొరియాలో ఈ పర్వతం కిమ్ వంశానికి ఆధ్యాత్మికంగా అతి ముఖ్యమైంది.
ఒంటరిగా తెల్ల గుర్రంపై సవారీని కిమ్ బాగా ఆస్వాదించినట్లు ఆయన సహాయకులు తెలిపారు. అది ప్రమాదకరమైన పర్వతమైనప్పటికీ కిమ్ ఏ మాత్రం భయపడకుండా తన పర్యటనను పూర్తి చేశారని ఆ మీడియా పేర్కొంది. కొరియా చరిత్రలో ఇదో అద్భుతమైన ఘట్టంగా అభివర్ణించింది. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో కిమ్ ఇలాంటి సాహస యాత్రలు చేస్తారట. మరి ఈసారి కిమ్ దేనిపై ప్రకటన చేస్తారో తెలియాల్సి ఉంది. ఇది ప్రపంచ దేశాలు ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించిన ధైర్యంగా నిలవడానికి ఇది సంకేతమని ఉత్తర కొరియాకు చెందిన నిపుణుడు జాషువా పొల్లాక్ తెలిపారు.