Breaking News
Home / Lifestyle / Recipes / కొబ్బరి-పాలక్‌

కొబ్బరి-పాలక్‌

కావలసినవి:

పాలకూర: నాలుగు కట్టలు(మీడియం సైజువి), కొబ్బరి తురుము: అరకప్పు, ఉల్లిపాయలు: రెండు, వెల్లుల్లి: 3రెబ్బలు, పసుపు: పావుటీస్పూను, జీలకర్ర: టీస్పూను,పచ్చిమిర్చి: రెండు, ఎండుమిర్చి: ఒకటి, కరివేపాకు: 4 రెబ్బలు, ఉప్పు: తగినంత, ఆవాలు: అరటీస్పూను, నూనె: తగినంత

తయారుచేసే విధానం:

పాలకూరను సన్నగా తరగాలి. ఉల్లి, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.వెల్లుల్లి, కొబ్బరితురుము, పసుపు, జీలకర్ర, రెండు రెబ్బల కరివేపాకు, పచ్చిమిర్చి మెత్తగా రుబ్బి పక్కన ఉంచాలి.బాణలిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు వేయాలి. అది వేగాక, రుబ్బిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి వేయించి, వేరే గిన్నెలోకి తీసి ఉంచాలి.అదే బాణలిలో తరిగిన పాలకూర, ఉప్పు వేసి, కాసిని నీళ్ళుచల్లి సిమ్‌లో ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరిపోయాక, వేయించి పెట్టిన కొబ్బరి మిశ్రమాన్ని వేసి, మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. తరవాత మూత తీసి మరో రెండు నిమిషాలపాటు పొడిపొడిలాడేలా వేయించి తీయాలి.

Check Also

పాల బొబ్బట్లు

Share this on WhatsAppకావల్సినవి: మైదా – కప్పు, నెయ్యి – టేబుల్‌స్పూను, ఉప్పు – చిటికెడు, నీళ్లు – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *