Breaking News
Home / Politics / ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కోదండరాం….

ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కోదండరాం….

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం ప్రకటించిన సందర్భంగా మాట్లాడుతూ ‘ఆర్టీసీ నష్టాల్లో ఉందంటూ పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ సంవత్సరం ప్రభుత్వాదాయం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తలకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని సీఎంపై మండిపడ్డారు. కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని దివాలా తీయిస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వంపై ఉద్యోగులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని కోదండరాం ఈ సందర్భంగా వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కేసీఆర్ తప్ప ఎవరూ కారణం కాదని, వారి సమ్మె విజయవంతమయ్యేందుకు తెలంగాణ సమాజం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. కేసీఆర్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం మొత్తం ఏకమవుతోందని, ‘ఆంధ్రా పాలకులను తరిమికొట్టిన మనకు కేసీఆర్ మెడలు వంచడం పెద్ద పనేం కాదు’ అని పేర్కొన్నారు. పంతొమ్మిదిన రాష్ట్ర బంద్‌కు అందరూ సహకరించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *