Breaking News
Home / States / ఆయన వ్యాఖ్యలతోనే ఆత్మహత్యలు….

ఆయన వ్యాఖ్యలతోనే ఆత్మహత్యలు….

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనపై సీఎం కేసీఆర్‌ మొండి వైఖరి అవలంభిస్తున్నారని, ఆయన చేసిన వ్యాఖ్యలతోనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. కోర్టు రాజ్యాంగ బద్దంగా చర్చలు జరపాలని ఆదేశించిందని, కానీ ప్రభుత్వం యూనియన్‌ నాయకులతో ఖైదీల తరహాలో వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ తీరు వల్లనే మళ్లీ చర్చలకు అవకాశం లేకుండా పోయిందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యము బతకాలంటే సకల జనుల సమర భేరీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ సకల జనుల సమర భేరి ఉద్యోగ, ఉపాధ్యాయులకు స్పూర్తిగా ఉంటుందని కోదండరామ్‌ పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *