Breaking News
Home / Sports / కోహ్లీ, బుమ్రాలకు అంతర్జాతీయ స్థాయి అవార్డులు

కోహ్లీ, బుమ్రాలకు అంతర్జాతీయ స్థాయి అవార్డులు

సియట్ సంస్థ ప్రతీ ఏటా ప్రకటించే అంతర్జాతీయ స్థాయి అవార్డులలో ఈ ఏడాది టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలకు అంతర్జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా.. బుమ్రాకి అంతర్జాతీయ అత్యుత్తమ బౌలర్లగా అవార్డులు ఇచ్చారు. వీరితో పాటు.. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం మొయిందర్ అమర్‌నాథ్ జీవితసాఫల్య పురస్కారం లభించింది.

ఇక చతేశ్వర్ పుజారాగాకు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్‌గా, రోహిత్ శర్మకు వన్డే క్రికెటర్‌ ఆఫ్ ద ఇయర్‌గా అవార్డులు లభించింది. ఇక మహిళలలో స్మృతి మంధనకు వుమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ‘‘2018-19లో క్రికెట్ చాలా అభివృద్ధి చెందింది. ప్రపంచస్థాయిలో క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు’’ అని ఆర్‌పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గొనేకా అన్నారు. అయితే తనకు అవార్డు లభించడం ఎంతో సంతోషంగా ఉందని అమర్‌నాథ్ తెలిపారు.

Check Also

ఒకరు లేటైతే..అందరికీ ఫైన్‌!

Share this on WhatsAppకోల్‌కతా: ప్రాక్టీ్‌సకు, సమావేశాలకు ఆలస్యంగా వచ్చే క్రికెటర్లకు జరిమానా విధించే విషయంలో ధోనీ వినూత్నంగా ఆలోచించాడు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *