Breaking News
Home / Sports / ధోనీని పక్కనపెట్టడంపై ఎట్టకేలకు స్పందించిన కోహ్లీ

ధోనీని పక్కనపెట్టడంపై ఎట్టకేలకు స్పందించిన కోహ్లీ

న్యూఢిల్లీ: టీ20ల నుంచి టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీని పక్కనపెట్టడంపై కోహ్లీ ఎట్టకేలకు స్పందించాడు. ఈ విషయంలో సెలక్టర్లు ఇప్పటికే స్పందించి ఉంటారని అనుకుంటున్నట్టు చెప్పాడు. కాబట్టి మరోసారి ఆ విషయంలో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు చెప్పాడు. అసలు విషయం ఏంటనేది సెలక్టర్లు వివరించి ఉంటారని అభిప్రాయపడ్డాడు. సెలక్టర్లు ఏం చెప్పారనే విషయం తనకు తెలియదన్నాడు. ధోనీ ఇప్పటికీ జట్టులో ఓ భాగమని కోహ్లీ తేల్చి చెప్పాడు.

యువ ఆటగాళ్లకు మేలు చేయాలన్నదే ధోనీ ఉద్దేశంమని పేర్కొన్నాడు. ధోనీ ఇప్పటికీ వన్డేల్లో తమతో ఆడుతున్నాడని, యువ ఆటగాళ్లకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నాడు. టీ20 జట్టు నుంచి ధోనీని తప్పించడంపై సచిన్ కూడా స్పందించాడు. సెలక్టర్ల ఉద్దేశం ఏంటని తనకు తెలియదని, అభిప్రాయాలను చెప్పడం వల్ల సెలక్టర్లపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నాడు.

Check Also

గంగూలీకి కీలక బాధ్యతలు.. ఐపీఎల్‌కు ఇద్దరు దూరం

Share this on WhatsAppఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *