Breaking News
Home / Sports / పాండ్యా, రాహుల్ కామెంట్ల‌పై కోహ్లీ స్పంద‌న‌!

పాండ్యా, రాహుల్ కామెంట్ల‌పై కోహ్లీ స్పంద‌న‌!

టీమిండియా క్రికెట‌ర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఇటీవ‌ల చేసిన అస‌భ్య‌క‌ర‌ కామెంట్ల గురించి ఎట్ట‌కేల‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ క్రికెట‌ర్లు అలాంటి కామెంట్లు చేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టాడు. అయితే అవి వారి వ్య‌క్తిగ‌త వ్యాఖ్యాల‌ని, వాటితో జ‌ట్టుకు ఎలాంటి సంబంధమూ ఉండ‌ద‌ని తెలిపాడు. వాళ్లిద్ద‌రిపైనా బీసీసీఐ తీసుకోబోయే నిర్ణ‌యం గురించి ఎదురుచూస్తున్న‌ట్టు చెప్పాడు. ఇటీవ‌ల `కాఫీ విత్ క‌ర‌ణ్‌` కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పాండ్యా, రాహుల్.. అమ్మాయిల గురించి, శృంగారం గురించి మాట్లాడిన సంగ‌తి తెలిసిందే.

`దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క్రికెట‌ర్లు అయిన‌ పాండ్యా, రాహుల్ చాలా అస‌భ్యంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యల‌ను టీమిండియా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌మ‌ర్థించ‌దు. జాతీయ జ‌ట్టులో ఆడుతున్న‌ప్పుడు బాధ్య‌త‌గా మెలగాలి. పర్య‌వ‌సానం ఎలా ఉంటుందో ఆలోచించాలి. ఏదేమైనా అవి వారి వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు. జ‌ట్టుకు ఎలాంటి సంబంధ‌మూ లేదు. వీటి ప్ర‌భావం జ‌ట్టుపై ఉండ‌దు. ఎలాంటి వివాదాలు ఎదురైనా మా క్రీడాస్ఫూర్తి చెదిరిపోదు. వారి గురించి బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి` అని కోహ్లీ అన్నాడు.

Check Also

గంగూలీకి కీలక బాధ్యతలు.. ఐపీఎల్‌కు ఇద్దరు దూరం

Share this on WhatsAppఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *