అమరావతి: సీఎం జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌లో తీసుకెళ్తున్నారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం నిరాహారదీక్ష చేస్తే అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. వైసీపీ దళారులు ఇసుకను దొడ్డిదారిలో అమ్ముతున్నారన్నారు. ఇసుక విషయంలో ప్రభుత్వం మెడలు వంచుతామని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రాజధానిలో పనులు ఆపేసి, సమాధులు కడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు బందర్‌పోర్టును ధారాదత్తం చేయడానికే.. పోర్టు పనులను ఆపేశారా? అని కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు.
