రాజోలు: మల్కిపురం మండలం తూర్పుపాలెంలోని పంట పొలంలో ఓఎన్జీసీ పైప్‌లైన్ నుండి కృడాయిల్తో కూడిన గ్యాస్ లీక్ అవడంతో గ్రామస్థులు భయందోళనకు గురైయ్యారు. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లే గ్రామస్థులు గ్యాస్ లీకేజీని చూసి స్థానిక మోరి జీసీఎస్‌కు సమాచారాన్ని అందించారు. అప్పటికే పంట పొలల్లో గ్యాస్ లీకేజ్ ప్రభావం అలల రూపంలో ఎగసిపడుతుంది. స్థానిక ఒఎన్జీసీ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి బావుల వద్ద ఉన్న వాల్వ్‌ల ఉధృతిని తగ్గించి గ్యాస్ లీకేజీని అదుపులోకి తెచ్చారు. తుప్పు పట్టిన పైప్లైన్ల కారణంగా తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, ఒఎన్జీసీ అధికారులు పట్టించుకోవటంలేదని కోనసీమ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
