Breaking News
Home / Film News / తెలంగాణ ముఖ్యమంత్రిగా కోటశ్రీనివాసరావు…!

తెలంగాణ ముఖ్యమంత్రిగా కోటశ్రీనివాసరావు…!

కోట శ్రీనివాసరావు వేయని పాత్రలు లేవు. ఎలాంటి పాత్ర అయినా ఆయనకు కొట్టిన పిండే. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పరభాషా చిత్రాలోనూ నటించి మెప్పించిన దిగ్గజ నటుడాయన. గతంలో పలు చిత్రాల్లో ఆయన ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. అలాగే, ప్రతిపక్ష నేత పాత్రల్లోనూ నటించారు. అయితే, కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రిగా నటించడం విశేషం. ‘రోరి’ అనే చిత్రంలో కోట తెలంగాణ సీఎం పాత్ర పోషించనున్నారు. కోట శ్రీనివాసరావు పుట్టినరోజును పురష్కరించుకుని ఆయన లుక్‌ను ‘రోరి’ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆయన చాలా సెన్సిటివ్ ముఖ్యమంత్రిగా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ పాత్ర పేరు ఆర్‌. రామన్న చౌదరి. ఈ చిత్రాన్ని సీటీఎస్‌ స్టూడియోస్‌, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్లపై చరణ్‌ రోరి నిర్మిస్తున్నారు. ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని ఇటీవలే విడుదల చేశారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం సమకూరుస్తున్నారు.

Check Also

బుల్లితెర నటుడికి కరోనా పాజిటివ్..! ఆందోళనలో టీవీ యాక్టర్స్.!

Share this on WhatsAppతెలంగాణలో కరోనా వైరస్ భారీగా విజృంభిస్తుంది. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *