Breaking News
Home / States / డబుల్‌ బెడ్‌రూం ఇండ్లపై కేటీఆర్‌ పరిశీలన….

డబుల్‌ బెడ్‌రూం ఇండ్లపై కేటీఆర్‌ పరిశీలన….

హైదరాబాద్‌: పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా కొల్లూరులో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హౌజింగ్‌ అడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 15,660 హౌసింగ్ యూనిట్లుగా గల టౌన్‌షిప్‌ను ప్రభుత్వం సకల వసతులతో నిర్మిస్తుంది. ఇండ్ల పరిశీలన అనంతరం మంత్రి కేటీఆర్‌ టౌన్‌షిప్‌కు గల అవసరాలపై నీళ్లు, విద్యుత్‌, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పార్కులు, విద్య, వైద్యం, రవాణా వంటి సదుపాయాలపై అధికారులతో సమీక్ష చేపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *