Breaking News
Home / States / మంత్రి సంతకంతో విద్యాశాఖలో కలకలం…

మంత్రి సంతకంతో విద్యాశాఖలో కలకలం…

నల్గొండ: విద్యాశాఖలో జిల్లా ఓపెన్ స్కూల్స్ కో ఆర్డినేటర్ పోస్ట్ కోసం మంత్రి కేటీఆర్ సంతకం ఫోర్జరీకి గురవడంతో కలకలం రేగింది. రావులపెంట జడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ మానవత్ మంగళ కో ఆర్డినేటర్ పోస్టు కోసం కేటీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ ఫోర్జరీతో పాటు నకిలీ లెటర్ హెడ్‌ కలిగిన లెటర్‌తో కో ఆర్డినేటర్ పోస్ట్‌లో కొంతకాలంగా మంగళ కొనసాగుతున్నారు. తాజాగా సంతకం ఫోర్జరీ అని తేలడంతో మంగళపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీనితో జిల్లా విద్యాశాఖ అధికారి తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *