హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఉండాలనేది తెలంగాణ ప్రభుత్వం ఉద్ధేశం. అందులో భాగంగా నేడు కూకట్ పల్లి నియోజకవర్గం, బాలానగర్ చిత్తారమ్మ బస్తీలో నిర్మించిన 108 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
