Breaking News
Home / States / లాజిస్టిక్ పార్క్ ప్రారంభించిన మంత్రి…

లాజిస్టిక్ పార్క్ ప్రారంభించిన మంత్రి…

హైదరాబాద్: మంగళ్‌పల్లిలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…  ప్రస్తుతం ఇబ్రహీంపట్నం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నదని, ఇబ్రహీంపట్నంలో రెండు లాజిస్టిక్ పార్కులు వస్తున్నాయని చెప్పారు. త్వరలోనే  సింగారంలో మరో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. కొత్త మున్సిపల్ చట్టం వచ్చిందని, కఠినమైన కొత్త చట్టం తీసుకువచ్చామన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, అది నెరవేరేదిశగా కృషి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. మంగళ్‌పల్లి లాజిస్టిక్ పార్క్‌తో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. మౌలిక వసతుల కల్పన పెంచి పారిశ్రామికాభివృద్ధిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *